ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

2 Jan, 2020 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది.  రూ. 279 రూ. 379  రీచార్జ్‌తో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్‌ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ రీఛార్జ్‌లో ఆన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. వీటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తోపాటు నాలుగు లక్షల జీవిత బీమాను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రూ. 279 రిఛార్జ్‌ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్యాక్‌ గడువు 28 రోజులని తెలిపింది. అలాగే రూ. 379 రీచార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే పొందడానికి వీలు ఉంటుంది. ఈ ప్లాన్‌ గడువు 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌తోపాటు ఇతర అన్ని నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది.

రూ.379 రీచార్జ్‌ ఫాస్టాగ్‌ కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు భారీగా కోత విధించగా.. తాజాగా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించి యూజర్లకు కొంత ఊరటనిచ్చింది. ఇటీవల అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్‌ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తమ కంపెనీ నష్టాలను పూడ్చేందుకే ఈ ధరలను పెంచుతున్నట్లు సదరు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొత్త ఎయిర్‌టెల్‌ ప్లాన్‌.. జియో, వొడాఫోన్ ఆఫర్‌లతో పోల్చితే మెరుగ్గానే ఉంది. జియో కూడా ప్రస్తుతం ఇలాంటి ఆఫర్‌నే  అందిస్తుండగా ఆఫ్-నెట్ కాల్స్ చేసుకోడానికి ఐయూసీ ఛార్జీలు చెల్లించాలనే షరతు ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు