ఆ ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇక అందరికీ!

22 Nov, 2017 22:13 IST|Sakshi

జియో రాకతో టెలికాం రంగంలో పెద్ద కుదుపులే వచ్చాయిని చెప్పాలి. అప్పటి వరకూ ఆకాశన్నంటిన డేటా ధరలు నేలకు దిగాయనే చెప్పాలి. జియో పోటీని తట్టుకొని మార్కెట్‌లో నిలబడటానికి ఇతర టెలికం కంపెనీలు అన్నీ చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు.

ఇందులో భాగంగానే తాజగా ఎయిర్‌టెల్‌ సరికొత్త పంధా ఎన్నుకుంది. గతంలో కొందరికి మాత్రమే ఇచ్చే బెనిఫిట్లను అందరికీ అందివ్వనుంది. గతంలో ఏదైనా కొత్త ప్లాన్‌ ప్రవేశ పెడితే అది సదరు వినియోగదారుడికి వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి మైఎయిర్‌టెల్‌ యాప్‌లో చూసుకోవాల్సి వచ్చేది. అందులో ఆఫర్ల జాబితాలో లేకపోతే అది వినియోగదారుడికి వర్తించదు. అయితే తాజగా ఎయిర్‌టెల్‌ ఆ విధానానికి స్వస్తి పలికింది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్రామిస్‌ పథకం కింద, ఎక్కువ మంది ఎయిర్‌టెల్‌ కష్టమర్లు వాడుతున్న కొన్ని ప్లాన్‌లను, ఓపెన్‌ మార్కెట్‌ ప్లాన్‌లుగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

రూ. 179, రూ. 349, రూ. 448, రూ. 549, రూ. 799 ప్లాన్లని ఇలా అందరికీ వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు ప్లాన్లు ఇకపై ఆ నిర్థిష్టమైన టెలికం సర్కిల్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులు అందరికీ  వర్తిస్తాయి.

మరిన్ని వార్తలు