ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ లాంఛ్‌..

23 Dec, 2019 11:39 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో వైఫై కాలింగ్‌ను ఎయిర్‌టెల్‌ లాంఛ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లకు మెరుగైన వాయిస్‌ కాలింగ్‌ అనుభూతిని వైఫై కాలింగ్‌ అందుబాటులోకి తీసుకువస్తుందని సంస్థ వెల్లడించింది. ఏ నెట్‌వర్క్‌లోని కస్టమర్లకైనా ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ను రిసీవ్‌ చేసుకోవచ్చని, ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌పై చేసే కాల్స్‌కు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పస్టం చేసింది. వైఫై సేవలపై కస్టమర్లు ఆసక్తి కనబరుస్తుండటంతో తొలుత తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు తొలుత దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేశామని భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణా సీఈవో అన్వీస్‌ సింగ్‌ పూరి వెల్లడించారు.

ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌కు ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఫై కాలింగ్‌కు అనుగుణంగా తాజా వెర్షన్‌కు ఫోన్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను కస్టమర్లు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫీ కాలింగ్‌ స్విచ్‌ ఆన్‌ చేసుకోవాలి. ప్రస్తుతం ఎయిర్‌టైల్‌ వైఫై కాలింగ్‌ను 6ఎస్‌తో పాటు ఆపైన వెలువడిన అన్ని యాపిల్‌ ఐఫోన్లు, షియామీ రెడ్మీ కే20, రెడ్‌మీ కే20 ప్రొ, శాంసంగ్‌ జే 6, ఏ 10, ఒన్‌ 6, ఎస్‌ 10, ఎస్‌ 10ప్లస్‌, ఎస్‌ 10ఈ, ఎం20 ఒన్‌ప్లస్‌ 7, 6 సిరీస్‌ ఫోన్లన్లీ సపోర్ట్‌ చేస్తాయి.

మరిన్ని వార్తలు