ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

27 Apr, 2018 13:00 IST|Sakshi

రిలయన్స్‌ జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్‌ మరో కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. 219 రూపాయలతో ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. అంటే మొత్తంగా 39.2జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. డేటాతో పాటు ‘హలో ట్యూన్‌’ ప్రయోజనాలను, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఈ ప్రయోజనాలు, ఇతర ఆపరేటర్లు రూ.199 ప్లాన్‌పైనే అందిస్తున్నాయి. కేవలం ఒక్క ప్రయోజనాన్నే ఎయిర్‌టెల్‌ అదనంగా ఆఫర్‌ చేస్తోంది. అది అపరిమిత ‘హలో ట్యూన్‌’. యూజర్లు తమ నెంబర్‌కు ఉచితంగా ఎయిర్‌టెల్‌ ట్యూన్‌ను యూజర్లు సెట్‌ చేసుకోవచ్చు.

ఎప్పడికప్పుడు తమ నెంబర్లకు కాలర్‌ ట్యూన్స్‌ను సెట్‌ చేసుకునే సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఎయిర్‌టెల్‌ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రిలయన్స్‌ జియో కూడా తన సర్వీసులు లాంచ్‌ చేసినప్పటి నుంచి ‘హలో ట్యూన్‌’ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ కూడా రూ.199 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 39.2జీబీ డేటా ఆఫర్‌చేస్తున్నప్పటికీ, హలో ట్యూన్‌ సర్వీసులను ఆఫర్‌ చేయడం లేదు. ఎయిర్‌టెల్‌ ఇటీవలే తన రూ.549, రూ.799 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లను సమీక్షించింది. సమీక్షించిన రూ.549 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ డేటాను ఆఫర్‌ చేస్తుండగా.. రూ.799 ప్లాన్‌పై రోజుకు 4జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కేవలం రూ.49తో కూడా ఓ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. 

మరిన్ని వార్తలు