ఓన్లీ కాలింగ్‌ : ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌

23 Jul, 2018 16:52 IST|Sakshi
టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్‌ ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ల నుంచి వస్తున్న గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది. ఇన్ని రోజులు డేటా టారిఫ్‌ ప్లాన్లతో పోటీ పడ్డ కంపెనీలు, తాజాగా కాలింగ్‌ ప్రయోజనాలతో కూడా పోటీపడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. అదే 299 రూపాయల ప్లాన్‌. ఈ ప్లాన్‌ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

టెలికాం టాక్‌ రిపోర్టు ప్రకారం.. ఎయిర్‌టెల్‌ తన సబ్‌స్క్రైబర్లకు రూ.299 ప్లాన్‌ కింద అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందజేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కాలింగ్‌లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి, ఇది ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులను విధించడం లేదు. అయితే ఈ ప్లాన్‌లో మేజర్ విషయం కస్టమర్లకు ఎలాంటి డేటాను అందించకపోవడం. ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా.. కేవలం అపరిమిత కాలింగ్‌ ప్లాన్‌గానే దీన్ని తీసుకొచ్చింది. ఈ టెలికాం ఆపరేటర్‌ ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది. ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్‌ సమీక్షించింది. ఈ అప్‌గ్రేడేషన్‌తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్‌టెల్‌ పెంచింది. 
 

మరిన్ని వార్తలు