ఎయిర్‌టెల్‌ కస‍్టమర్లకు వార్షికోత్సవ గిఫ్ట్‌

16 Aug, 2018 15:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ తన వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది.  కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందిస్తోంది.  పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ కస‍్టమర్లందరికీ  51 రూపాయల విలువైన అమెజాన్ పే డిజిటల్ గిఫ్టు కార్డును  ఆఫర్‌ చేస్తోంది.  దీని ద్వారా మొబైల్ రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపులు లేదా అమెజాన్ ప్లాట్‌ఫాంలో షాపింగ్ చేయడానికి  ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ తన 23వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా తన కస్టమర్లందరికీ ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది.  ఈ ఆఫర్‌లో కస్టమర్‌కు రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్ బ్యాలెన్స్  అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌   ప్రకటించింది. అయితే ఎయిర్‌టెల్‌లో రూ.100 ఆపైన విలువైన  ప్రీపెయిడ్ ప్యాక్‌ను లేదా పోస్ట్‌పెయిడ్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను వాడే కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు.
 

ఎలా పొందాలి
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మై ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉండే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో 15 డిజిట్లు ఉన్న వోచర్ కోడ్ కస్టమర్‌కు లభిస్తుంది. ఈ కోడ్‌ను అక్టోబర్ 31, 2018 తేదీ లోపు అమెజాన్ పే అకౌంట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాలి. అదెలాంటే అమెజాన్‌ పేలో యాడ్‌ గిఫ్ట్‌కార్డ్‌ మీద క్లిక్‌ చేయాలి. అక్కడ  వోచర్‌ కోడ్‌  ఎంటర్‌ చేసి, యాడ్‌ నౌ అని క్లిక్‌ చేస్తే మీ బాలెన్స్‌ యాడ్‌ అయినట్లు  డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

వార్షికోత్సవ వేడుకల్లో వినియోగదారుల సంతోష పెట్టడానికి అమెజాన్ పే తో భాగస్వామి కావడం ఆనందదాయకమని,  వినియోగదారుల్లో స్మార్ట్‌ఫోన్లు ఆన్లైన్ షాపింగ్ చాలా ప్రజాదరణ పొందిందని  ఎయిర్‌టెల్‌ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ పేర్కొన్నారు. అలాగే ఈ వేడుకలో ఎయిర్‌టెల్‌తో భాగస్వాములైనందుకు  సంతోషిస్తున్నామని అమెజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్  షారుఖ్ ప్లాస్టిక్‌వాలా  తెలిపారు.

మరిన్ని వార్తలు