కార్డ్‌ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్‌ విత్‌డ్రా

7 Sep, 2018 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కార్డ్‌ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్‌పేస్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరో ఎలక్ట్రిక్‌ సైకిళ్లు  జపాన్‌ కంపెనీలతో ఒప్పందాలు  

రైల్వేకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా జియో

మారుతీ నుంచి కొత్త ఎర్టిగా...

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌100 ‘ఐ–టచ్‌ స్టార్ట్‌’

ప్యాసింజర్‌ వాహనాల నెమ్మది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రపంచంలోనే బెస్ట్‌ అమ్మ

తైముర్‌ ఫర్‌ సేల్‌

ఆకాశవాణి.. ఇది కార్తికేయ బోణి

అల్లు అర్హా@2

కొంగు విడువనులే...

మీటూ ఫ్యాషన్‌ అయిపోయింది