వెయ్యిమంది రిటైలర్స్‌పై వేటు!

8 Jan, 2018 14:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వివాదాల్లో ఇరుక్కున్న ఎయిర్‌టెల్‌ పేమెంట్స్ బ్యాంక్  మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు సైన్ అప్ చేస్తున్నప్పుడు సరైన ప్రక్రియను అనుసరించని రిటైలర్స్‌పై భారీ వేటు వేసింది. ఇ-కెవైసి లైసెన్స్ సస్పెండ్ కు దారితీసిన లోపాలను గుర్తించేందుకు  చేపట్టిన  విచారణ అనంతరం ఈ చర్య వెలుగులోకి వచ్చింది.

తాజా నివేదికల ప్రకారం దాదాపు వెయ్యిమందికిపైగా రిటైలర్స్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది.  ‘ఎకనామిక్స్‌ టైమ్స్‌’ అందించిన  నివేదిక ప్రకారం నిర్వహించిన అంతర‍్గత విచారణ అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌  ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు రిటైలర్ల భారీ జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి సారి తప్పు చేసిన వారికి తాము  చెల్లించిన కమీషన్‌పై 50 రెట్లు ఎక్కువ జరిమానా విధించింది. అలాగే రిపీట్ నేరస్థులను తమ నెట్‌వర్క్‌నుంచి తొలగించడంతోపాటు వాటిపై జరిమానా కూడా విధించింది. అయితే ఈ పరిణామాలపై  ఎయిర్‌టెల్‌  ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా, కస‍్టమర్ల  అనుమతి లేకుండానే  వంట గ్యాస్‌  సిలిండర్ల సబ్సిడీ ఎయిర్‌టెల్‌  పేమెంట్‌ బ్యాంకుకు మళ్లించిన వ్యవహారంలో  భారతి ఎయిర్‌టెల్‌  చిక్కుల్లో పడింది.  ఈ నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)  ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌  ఆధార్‌ బేస్డ్‌ ఈకేవైసీ లైసెన్సును రద్దు చేసింది. మరోవైపు ఈ వివాదం కారణంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్‌బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశి అరోరా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు