ఆ ప్యాక్‌లపై రోజువారీ డేటా పెంపు

23 Jan, 2018 15:23 IST|Sakshi

రిలయన్స్‌ జియోను ఎదుర్కొనడానికి టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ డేటా రేట్లను తగ్గిస్తూనే ఉంది. అంతేకాక తాను అందించే ప్యాక్‌ల వాలిడిటీ పెంచడం, డేటాను ఎక్కువగా ఆఫర్‌ చేయడం కూడా చేస్తూ ఉంది. తాజాగా మరో మూడు ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను ఎయిర్‌టెల్‌ సమీక్షించింది. దీనిలో 199 రూపాయల ప్యాక్‌, 448 రూపాయల ప్యాక్‌, 509 రూపాయల ప్యాక్‌ ఉన్నాయి. ఈ మూడు ప్యాక్‌లపై ఇక నుంచి రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అంతకముందు ఈ ప్యాక్‌లపై రోజుకు కేవలం 1జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందేవారు. రోజువారీ డేటా పరిమితిని పెంచడమే కాకుండా... అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.199 ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు కాగ, రూ.448 ప్యాక్‌ వాలిడిటీ 82 రోజులు, రూ.509 ప్యాక్‌ వాలిడిటీ 90 రోజులుగా ఉంది. 

అప్‌డేట్‌ చేసిన ఈ మూడు ప్యాక్‌లు రిలయన్స్‌ జియోకు డైరెక్ట్‌ పోటీగా ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ 199 రూఎయిర్‌టెల్‌, ప్రీపెయిడ్‌ ప్యాక్స్‌, డేటా ఆఫర్‌పాయల ప్యాక్‌, జియో 198 రూపాయల ప్యాక్‌కు గట్టి పోటీ ఇస్తోంది. జియో తన 198 ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను యూజర్లకు అందిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. అదేవిధంగా ఎయిర్‌టెల్‌ 448 రూపాయల ప్యాక్‌, జియో 498 రూపాయల ప్యాక్‌కు పోటీగా ఉంది. ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటాను 84 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది. ఇక చివరిగా 509 రూపాయల ప్యాక్‌, జియో 498 రూపాయల ప్యాక్‌కు పోటీ ఇస్తోంది. ఈ మూడు ప్యాక్‌లు మాత్రమే కాక, ఎయిర్‌టెల్‌ 349 రూపాయల ప్యాక్‌ను అప్‌డేట్‌ చేసింది. దీనిపై రోజుకు 2.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. మిగతా ప్రయోజనాలన్నీ అదేవిధంగా ఉండనున్నాయి. ప్రస్తుతం సమీక్షించిన ప్యాక్‌లు, వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో కంపెనీ అప్‌డేట్‌ చేయలేదు. ఎయిర్‌టెల్‌ కూడా వీటిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు