ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ 

11 May, 2019 16:23 IST|Sakshi

వినియోగదారులకు  ఎయిర్‌టెల్‌ వినూత్న కానుక

రూ. 249 ప్లాన్‌ పై  రూ.4 లక్షల ఇన్సూరెన్స్‌

సాక్షి, ముంబై:  ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది.  ప్రధాన ప్రత్యర్థులు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌కు పోటీగా ఇటీవల  పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను  సమీక్షించిన ఎయిర్‌ టెల్‌ తాజాగా మరో  కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.  ముఖ్యంగా డేటా ప్రయోజనాలతో పాటు,  భారీ ఇన్సూరెన్సును కూడా అందిస్తోంది. 

రూ.249  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి
రూ.249 ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  ప్లాన్‌  వాలిడిటీ 28 రోజులు. అంతేకాదు  ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సేవ‌లు, జీ5, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, ఏడాదిపాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు, వింక్ సభ్యత్వం ఉచితంగా ల‌భిస్తాయి. 

రూ.249  రీచార్జి చేసుకున్న వెంట‌నే ప్రీపెయిడ్‌  క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేసుకున్న వినియోగదారుడు  ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా  భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ ఇష్యూ అవుతుంది. 

దీంతోపాటు రూ.129 కు మ‌రో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌లో క‌స్టమ‌ర్లకు రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. 
 

మరిన్ని వార్తలు