ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ : జీ5 ప్రీమియం ఫ్రీ

7 Jul, 2020 19:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను మళ్లీ లాంచ్ చేసింది. ఇందులో రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను అందివ్వనుంది. అపరిమిత కాలింగ్ సదుపాయాన్నిఅందిస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ  28 రోజులు. దీంతో పాటు 28 రోజుల పాటు జీ5 ప్రీమియం సభ్యతాన్ని ఉచితంగా అందించనుంది.  (జియోమీట్‌కు పోటీ :ఎయిర్‌టెల్‌ త్వరలోనే)

289 రూపాయల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ రీఛార్జి చేసే వినియోగదారులకు జీ 5 ప్రీమియంతోపాటు, అపరిమిత లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ కాల్స్ ఉచితం. రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డైలీ డేటా  రోజుకు 100 ఎస్‌ఎంఎస్ సందేశాలు 28 రోజులు పాటు లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం చందాతో 400 కి పైగా లైవ్ టివి ఛానెల్స్  ను ఎంజాయ్ చేయవచ్చు. షా అకాడమీ ద్వారా వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు కూడా లభ్యం. అలాగే 79 టాప్-అప్ వోచర్ ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. దీని ద్వారా  జీ 5 ప్రీమియం సభ్యత్వాన్ని 30 రోజుల పాటు అందివ్వనుంది. 

కాగా 2018 లో, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు ఒక జీబీ డేటాతో 289 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 48 రోజుల పాటు చెల్లుబాటయ్యేలా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది.  అదే పీపెయిడ్ ప్లాన్ ను తాజా ప్రయోజనాలతో  తీసుకొచ్చింది. 

మరిన్ని వార్తలు