ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

28 May, 2018 17:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టెలికాం సంస్థ  భారతి ఎయిర్‌టెల్  తన ప్రధాన ప్రత్యర్థి జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.  జియో  448 రూపాయల రీచార్జ్ ప్లాన్‌కు  ధీటుగా  రూ.449 ల  కొత్త  ప్రీపెయిడ్ ప్లాన్‌ను   దేశవ్యాప్తంగా  తన కస‍్టమర్లకు అందుబాటులోకి  తెచ్చింది.  ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా  వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు.  అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది.   దీనితోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు  లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీకి 168 జీబీ డేటా లభిస్తుంది. తాజాగా ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా