లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసిన ‘రకుల్‌’

13 Feb, 2020 18:16 IST|Sakshi

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టిన అజియో.కామ్‌ 

‘లాంగ్ లివ్ బోల్డ్‌’   పేరుతో దుస్తులు

సాక్షి, ముంబై : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫాషన్‌ ఇ-రిటైలర్  అజియో.కామ్‌ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో  తన ఫ్యాషన్‌ దుస్తులతో సందడి చేసింది. ముంబైలోని జియో గార్డెన్స్‌లో బుధవారం జరిగిన లాక్మే ఫ్యాషన్‌ 20వ ఎడిషన్‌లో ’లాంగ్‌ లివ్‌ బోల్డ్‌’ పేరుతో యువతీ యువకులకోసం ట్రెండీ,క్లాసీ దుస్తులను ప్రదర్శించింది. గ్లామర్‌,  స్టయిల్‌,ఫ్యాషన్‌ ల కాంబినేషన్‌తో తీసుకొచ్చిన తమ సరికొత్త వస్త్రాలు రాబోయే వేసవి సీజన్‌లో వినియోగదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయని కంపెనీ తెలిపింది. 

2016లో డౌట్‌ ఈజ్‌ ఔట్‌ అంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. తాజాగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో తనదైన శైలి దుస్తులతో మరోసారి అదరగొట్టింది. ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాజ్ రూపొందించిన  దుస్తులను  ప్రదర్శించింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అజియో రూపొందించిన స్టైలిష్‌ దుస్తుల్లో ర్యాంప్‌ మీద  మెరిసారు. 2000 గ్లోబల్ సూపర్ బ్రాండ్లు, 2లక్షల 70వేల స్టైల్స్‌, విలక్షణమైన ప్రింట్లు, రంగులతో లాంగ్‌ లివ్‌ బోల్డ్ కలెక్షన్స్‌ ఆకట్టుకుంటాయనీ అజియో .కామ్‌ బిజినెస్ హెడ్ వినీత్ నాయర్ దీమా వ్యక్తం చేశారు.భారత దేశంలో ప్రధానంగా ఉ‍న్న యంగ్‌ జనరేషన్‌  కోసం  కంఫర్టబుల్‌,  బోల్డ్‌ దుస్తులను తీసుకొచ్చామన్నారు. 

యువతుల కోసం జంప్‌ సూట్స్‌, క్యాజువల్‌ సూట్స్‌, క్రాప్‌టాప్స్‌ , డెనిమ్‌ జాకెట్స్‌, ఫ్లోరల్‌  ప్రింట్స్‌ మోడల్స్‌లో ఆకర్షణీయమైన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. అలాగే యువకులకోసం తీసుకొచ్చిన ఫన్నీ బ్యాగ్‌లు జోడించిన ఓవర్‌సైజ్డ్ జాకెట్స్, జాగర్స్, క్లాసీ మిలటరీ ప్రింట్స్‌  హైలైట్‌గా నిలిచాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా