రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేయండి..!

2 Jan, 2018 18:49 IST|Sakshi

భువనేశ్వర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఒడిశాకు చెందిన ఒకవ్యక్తి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది.  ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితులు,  పెద్ద నోట్ల రద్దు, డిజిటల్‌ ఎకానమీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ కుమార్ పట్నాయక్ ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.అవినీతిని అంతంచేయడానికి పెద్దనోట్లను రద్దు చేస్తే.. రద్దైన వెయ్యి రూపాయల నోట్ల కంటే రూ.2వేల నోట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.  

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సాహించాల్సిన అవసరం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు.  ముఖ్యంగా మెట్రో నగరాల్లో , పెద్ద నగరాల్లోని  ప్రజలకు వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలరు. వారికి కరెన్సీ అవసరం. కానీ చిన్న పట్టణాల్లో లేదా గ్రామాలలోని నిరక్షరాస్యులైన  ప్రజలకు  కరెన్సీ మాత్రం అవసరమవుతుంది. దయచేసి రూ.500,  రూ.2వేల నోట్ల  ముద్రణను నిలిపివేయండి. రాబోయే రెండు సంవత్సరాల్లో పెద్ద కరెన్సీల ఉపసంహరణకు ప్లాన్ చేయమని కోరుతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

భారతదేశ పేద పౌరుల ఆర్థిక పరిస్థితుల గురించి మీకు తెలియదా? దేశంలో ప్రతి ఒక్కరూ మినిమం బ్యాలెన్స్‌ కొనసాగించేంత ధనికమైందా భారతదేశం? మినిమం బ్యాలెన్స్‌ నిర్ణయంపై  నేను చాలా ఆశ్చర్యపోతున్నాను? దీనిపై విచారణ జరగాలని కోరుకుంటున్నాను. కనీసం జాతీయీకరించిన బ్యాంకుల్లోనైనా జీరో బ్యాలెన్స్‌  ఖాతాలు ఉండాలని  మీరు  భావించడంలేదా? లాంటి  ప్రశ్నలను సంజయ్‌ కుమార్‌ సంధించారు.

పబ్లిక్ / కంపెనీలు / పరిశ్రమలకు ఇచ్చే రుణాలు  చాలా అరుదుగా బ్యాంకులు  రికవరీ చేస్తాయి. కానీ  పేదల రుణాలను రాబట్టడంలో మాత్రం  ఎందుకు ధైర్యం చేస్తాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మోదీజీ మీరు మీ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర పార్టీలపై ఆధిపత్యంకోసం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ఈ మెయిల్ మిమ్మల్ని లేదా బీజీపీకి బాధించదు కనుక లేఖను రద్దు చేయండి. ఇప్పటికీ దేశాన్ని మార్చడానికి  చాలా అవకాశం ఉంది.    నా లేఖను  పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను. సంబంధిత చర్య  తీసుకుంటారని భావిస్తున్నానంటూ ఆయన లేఖను ముగించారు.

 

మరిన్ని వార్తలు