ఈ-కామర్స్‌ దిగ్గజంలో 3.6 కోట్ల ఉద్యోగాలు

13 Apr, 2018 08:48 IST|Sakshi

బీజింగ్‌ : చైనీస్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా 2017లో భారీగా ఉద్యోగాలు సృష్టించింది. తన రిటైల్‌ ఎకోసిస్టమ్‌ విస్తరణతో అలీబాబా దాదాపు 3.68 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ట్మాల్‌, టాబో వంటి కంపెనీకి చెందిన పలు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు 50 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు విపరీతంగా వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు 2017లో భారీగా 14.05 మిలియన్‌ ఉద్యోగాలను కల్పించాయని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఈ కంపెనీలో దుస్తులు, వస్త్రాలు, రోజువారీ అవసర, గృహోపకరణ ఉత్పత్తులు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్న రిటైల్‌ ఉత్పత్తుల్లో టాప్‌-3లో ఉన్నట్టు పేర్కొంది. 

ఆన్‌లైన్‌ రిటైల్‌ సర్వీసులు భారీగా పైకి ఎగుస్తుండటంతో, ఆర్‌ అండ్‌ డీ, డిజైన్‌, మానుఫ్రాక్చరింగ్, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో నిపుణులకు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది. మొత్తంగా ఇవి 22.76 మిలియన్‌ ఉద్యోగాలను సృష్టించినట్టు నివేదించింది. 2017 నాలుగో క్వార్టర్‌లో అలీబాబా కంపెనీ సైతం ఏడాది ఏడాదికి 56 శాతం వృద్ధిని నమోదుచేసింది. ప్రస్తుతం ఈ-కామర్స్‌ మార్కెట్‌లో మధ్య, దీర్ఘకాలిక ప్లాన్లను రూపొందించే నిపుణులకు, బిజినెస్‌ మోడల్స్‌ను సంస్కరించే వారికి, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్కిల్స్‌తో డిజిటల్‌ టెక్నాలజీస్‌ను అనుసంధానించే నిపుణులకు మంచి డిమాండ్‌ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా