వాల్మార్ట్ ను దాటనున్న ఆలీబాబా

23 Mar, 2016 01:29 IST|Sakshi
వాల్మార్ట్ ను దాటనున్న ఆలీబాబా

బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ప్లాట్‌ఫాంగా అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ను..  చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా త్వరలోనే అధిగమించగలదని అంచనాలు నెలకొన్నాయి. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 463.3 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ పరిమాణం సాధిస్తామని ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ తెలిపింది. జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వాల్‌మార్ట్ నమోదు చేసిన 478.6 బిలియన్ డాలర్ల నికర అమ్మకాలకు ఇది దాదాపు సమీపంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్‌ను ఆలీబాబా అధిగమించే రోజు దగ్గర్లోనే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  2020 నాటికల్లా తమ వార్షిక ట్రేడింగ్ పరిమాణం దాదాపు 980 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగదలని అంచనా వేస్తున్నట్లు ఆలీబాబా సీఈవో ఝాంగ్ యాంగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు