ఆలీబాబా సింగిల్స్‌ డే రికార్డు..

12 Nov, 2018 01:53 IST|Sakshi

16 గంటల్లో 25 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు

షాంఘై: చైనా ఈ–కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా ఆదివారం నిర్వహించిన సింగిల్స్‌ డే సేల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. గతేడాది సింగిల్స్‌ డే రోజు నమోదైన 25 బిలియన్‌ డాలర్ల విక్రయాలను కేవలం 16 గంటల్లోనే సాధించి తన రికార్డు తానే తిరగరాసుకుంది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పాలపౌడరు, డైపర్లు మొదలైనవి కూడా అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఉన్నాయి.

జంటల కోసం ఉద్దేశించినదైన వేలంటైన్స్‌ డేకి భిన్నంగా పదకొండో నెల పదకొండో తారీఖుని సింగిల్స్‌ (ఒంటరి) డేగా చైనా యువత పాటిస్తుంది. దీన్ని పురస్కరించుకుని వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి సింగిల్స్‌ డే తొలి గంటలోనే ఆలీబాబా సుమారు 10 బిలియన్‌ డాలర్ల మార్కును దాటేసింది. అయితే, అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ.. ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫరు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు క్రమంగా సింగిల్స్‌ డే కోసమే ఎదురుచూడటం తగ్గుతోందని, ఫలితంగా అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.   

మరిన్ని వార్తలు