పేటీఎంలోకి ఆలీబాబా మరో రూ.1,200 కోట్లు!

3 Mar, 2017 00:46 IST|Sakshi
పేటీఎంలోకి ఆలీబాబా మరో రూ.1,200 కోట్లు!

న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్‌ సంస్థలో చైనా ఈ–కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా, మరో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఎస్‌ఏఐఎఫ్‌ (సెయిఫ్‌) పార్ట్‌నర్స్‌ దాదాపు 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,350 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. ఆలీబాబా సింగపూర్‌ ఈ–కామర్స్‌ సంస్థ 177 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.1,200 కోట్లు), మిగతా మొత్తం సెయిఫ్‌ పెట్టుబడి పెట్టనున్నాయి.

తాజా పెట్టుబడుల అనంతరం పేటీఎం ఈ–కామర్స్‌లో ఆలీబాబా సింగపూర్‌ ఈ–కామర్స్‌ వాటాలు 36.31 శాతంగాను, సెయిఫ్‌ పార్ట్‌నర్స్‌ వాటా 4.66 శాతంగాను ఉండనున్నాయి. ఈ డీల్‌తో పేటీఎం వేల్యుయేషన్‌ దాదాపు 1 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. గతంలో 60 మిలియన్‌ డాలర్లు సమీకరించినప్పుడు పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ వేల్యుయేషన్‌ 4.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కి ప్రస్తుతం పేటీఎం ఈ–కామర్స్, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్, పేటీఎం మొబైల్‌ సొల్యూషన్స్‌ అనే మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి.


దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెరికన్‌ ఆన్‌లైన్‌  రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ ఆధిపత్యం చెలాయిస్తున్న దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుత డీల్‌ ఆలీబాబాకు ఉపయోగపడనుంది. దూకుడుగా దూసుకెళుతున్న అమెజాన్‌ తన మార్కెట్‌ వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. మరోవైపు, నిధుల కొరతతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆలీబాబా రాక.. దేశీ ఆన్‌లైన్‌ రిటైల్‌ పరిశ్రమ ఓ కుదుపు కుదపగలదని పరిశీలకుల అంచనా. 2015లో 11 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ 2016 చివరికి 14–16 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం నాటికి 69 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌