రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..

18 May, 2019 00:03 IST|Sakshi

ఈఏసీ– పీఎం సభ్యురాలు షమికా రవి 

న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్‌ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ–పీఎం సభ్యుడు రతిన్‌రాయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బ్రూకింగ్స్‌ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే ఓ సందర్భంలో రతిన్‌ రాయ్‌ మాట్లాడుతూ... ‘‘1991 నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై ఆధారపడి వృద్ధి చెందడం లేదు. దేశంలోని పది కోట్ల మంది వినియోగం ఆధారంగానే వృద్ధి చెందుతోంది. భారత వృద్ధి ప్రస్థానానికి శక్తినిస్తోంది వీరే. అంటే త్వరలోనే మనం ఓ దక్షిణ కొరియా కాదు, చైనా కూడా కాబోవడం లేదు.  బ్రెజిల్, దక్షిణాఫ్రికా కానున్నాం. అధిక సంఖ్యలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారితో మధ్యదాయ దేశంగా మారబోతున్నాం’’అని అన్నారు. దానిపై షమికా ఈ వ్యాఖ్యలు చేశారు .

మరిన్ని వార్తలు