కరెన్సీ కష్టాలను తొలగిస్తాం

12 Dec, 2016 15:24 IST|Sakshi
కరెన్సీ కష్టాలను తొలగిస్తాం

బ్యాంకుల వద్ద పరిస్థితులు మెరుగుపడ్డారుు
సామర్థ్యం మేరకు    కొత్త నోట్ల ముద్రణ
పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్  వెల్లడి
ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేయాలని సూచన

 ముంబై: నోట్ల రద్దు అనంతరం సామాన్యులు పడుతున్న కరెన్సీ కష్టాలపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తొలిసారిగా స్పందించారు. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సామా న్యుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా పటేల్ పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ప్రెస్‌లు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు
‘‘ప్రింటింగ్ ప్రెస్‌లు కొత్తగా రూ.100, రూ.500 నోట్లను ముద్రించే పనిలో ఉన్నారుు. డిమాండ్‌ను చేరుకునేందుకు వీలుగా ప్రెస్‌లు పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తున్నారుు. ఈ సమయంలో ప్రజలు నగదుకు బదులు డెబిట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లను ఉపయోగించుకోవడం ప్రారంభించాలి. వీటితో లావాదేవీలు చౌకగా, తేలిగ్గా మారతారుు. దీర్ఘకాలంలో ఇది దేశానికి మేలు చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల స్థారుులో తక్కువ నగదు వినియోగం ఉన్న దేశంగా భారత్ మారుతుంది. వ్యాపారుల వద్ద పీవోఎస్ మెషిన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరుతున్నాం. దీంతో డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతుంది.

బ్యాంకు శాఖల్లో, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గారుు. మార్కెట్లు తిరిగి యథావిధిగా పనిచేస్తున్నారుు. నిత్యావసరాల కొరత ఉన్న ట్టు ఎటువంటి సమాచారం లేదు. ఏటీఎంల్లో మార్పుల కోసం 50వేల మందిని రంగంలోకి దింపాం. నగదు లభ్యత తగినంత ఉంది. బ్యాంకులు నగదును శాఖలకు, ఏటీఎంలకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు. బ్యాంకుల సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలకు కృతజ్ఞతలు’’ అని ఉర్జిత్ పటేల్ అన్నా రు. 

నకిలీకి వీలుకాని నోట్లు..
‘‘కొత్త నోట్ల సైజు, మందాన్ని ఎందుకు మార్చారని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ స్థారుులో మార్పులు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుం ది. నకిలీకి వీలుకాని రీతిలో రూ. 2000, రూ. 500 నోట్లను డిజైన్ చేశాం’’ అని ఉర్జిత్ వివరించారు.

 నగదు రహితంవైపు మళ్లేందుకు...
నకిలీ కరెన్సీ నోట్లపై కూడా ఇది ఒకరకమైన దాడే. వ్యాపారులు, ప్రజలను నగదు రహితం వైపు మళ్లించేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంకులు సైతం డెబిట్ కార్డుల చెల్లింపులపై చార్జీలను ఎత్తివేశారుు. లెక్కల్లోకి రాని ధనాన్ని కొందరు పెద్ద నోట్ల రూపంలో కలిగి ఉన్నారు. రియల్ ఎస్టే ట్ వంటి రంగాలను పన్ను ఎగవేతలకు ఉపయోగించుకుంటున్నారు’’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు.

 ఒక్క రోజులో అయ్యేది కాదు..
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, వ్యాపారం తగ్గుదలపై ప్రశ్నకు ఉర్జిత్ స్పందించారు. ‘‘ఇది జీవిత కాలంలో ఒక్కసారి చోటుచోసుకునే ఘటన వంటిది. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. నోట్ల రద్దు విషయంలో పూర్తి గోప్యత అవసరం. ఈ రకమైన ఆపరేషన్ చాలా పెద్దది. ఇలాంటి సమయంలో బ్యాంకు లు అన్నింటినీ పూర్తి సర్వ సన్నద్ధం చేయడం 24 గంటల్లో సాధ్యమయ్యేది కాదు. అరుుతే, దీని వల్ల కొంత అసౌకర్యం ఉంటుందన్నది నిజమే. అందుకే పన్ను ఎగవేత, నల్లధనంపై పోరాటం కోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు.

 ఎప్పుడు సాధారణ పరిస్థితి...?
పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ బదులిస్తూ... ‘‘పరిస్థితి మెరుగుపడిందని బ్యాంకులు అంటున్నారుు. మెట్రో నగరాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత ఇబ్బంది ఉన్నట్టు అవి చెబుతున్నారుు. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత పెరిగింది. రుణాలు మరింత సులభంగా లభిస్తారుు. సాధ్యమైనంత త్వరలో పరిస్థితులను సాధారణీకరించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం’’అని చెప్పారు.

 ఇంక్రిమెంట్ సీఆర్‌ఆర్ పెంచాం...
ఆర్‌బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను (క్యాష్ రిజర్వ్ రేషి యో) 100 శాతం పెంచినట్టు ఉర్జిత్ పటేల్ వెల్లడిం చారు. ‘‘రద్దరుున రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో బ్యాంకు ల్లో భారీగా డిపాజిట్లు పెరిగిపోయారుు. నగదు లభ్యత పెరిగినందువల్ల తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్‌ఎస్) కింద బాండ్లను తగినంత విడుదల చేసిన వెంటనే సీఆర్‌ఆర్ పరిస్థితిని సమీక్షిస్తాం’’ అని చెప్పారు.

ఆర్‌బీఐ గవర్నర్‌పై జైరామ్ వ్యాఖ్యలు సరికాదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఆర్‌బీఐ గవర్నర్‌పై జైరామ్ రమేశ్ వ్యాఖ్యలు అన్యాయమని పేర్కొన్నారు. ఎవరైతే తమకు తాము మద్దతుగా అదే స్వరంతో స్పందించలేకుండా ఉంటారో... అటువంటి వారిపై వ్యాఖ్యలకు రాజకీయనేతలు దూరంగా ఉండాలని సూచిస్తూ జైట్లీ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఓ ఆర్టికల్‌లో జైరామ్ రమేశ్ ఆర్‌బీఐను లక్ష్యంగా చేసుకున్న విష యం తెలిసిందే. ‘‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం అనూహ్య నిర్ణ యం తీసుకోవడం ద్వారా ఆర్‌బీఐని చీకట్లోకి నెట్టేసింది.

నోట్ల రద్దు విషయమై ఆర్‌బీఐ సన్నద్ధత గురించి జాతిని తప్పుదోవ పట్టించడంలో ఉర్జిత్ పటేల్ అపరాధి అరుు ఉండవచ్చు లేదా ఆర్‌బీఐ స్వతంత్రను పణంగా పెట్టి ఉండవచ్చు. ఏదైనప్పటికీ ఆయన రాజీనామా చేయాలి’’ అని జైరామ్ రమేశ్ డిమాండ్ చేశా రు. దేశంలో ఆర్‌బీఐ మానిటరీ సంస్థ అని, అందరికీ బ్యాంకు నోట్లు అందుబాటులో ఉంచే బాధ్యత దానిపై ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా