ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించిన అలహాబాద్‌ బ్యాంకు

30 Nov, 2017 10:57 IST|Sakshi

కోల్‌కత్తా : ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్‌ బ్యాంకు బుధవారం తన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌-బేస్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌) రేట్లను తగ్గించింది. గృహ, కారు, ఇతర రుణాలను చౌకగా చేస్తూ ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన ఈ రేటు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు చెప్పింది. అన్ని టెనోర్స్‌కు ఇది వర్తించనుంది. 

ఎంసీఎల్‌ఆర్‌ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గడంతో, 8.3శాతంగా ఉన్న వడ్డీరేట్లు, 8.25 శాతానికి దిగొచ్చాయి. దీని ఫలితంగా గృహ, కారు, ఇతర రిటైల్‌ రుణాలు తగ్గనున్నాయని బ్యాంకు తెలిపింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో అలహాబాద్‌ బ్యాంకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత ఏడాది కాలంగా 50 లక్షల మంది కొత్త యూజర్లను అలహాబాద్‌ బ్యాంకు తన ఖాతాదారులుగా చేర్చుకుంది. నవంబర్‌ ప్రారంభంలో ఎస్‌బీఐ తన వడ్డీరేట్లకు కోత పెట్టగా... ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంకు కూడా ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించింది.   ​

మరిన్ని వార్తలు