గుడ్‌న్యూస్ : నో మినిమం బ్యాలెన్స్ 

11 Jun, 2019 13:51 IST|Sakshi

సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుభవార్త చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా  పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది.  ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  విత్‌ డ్రాలపై నిబంధనలను ​కూడా  సడలించింది.  నెలకు  4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు  ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది.  ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది.  వీరికి కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది. అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను వారినుంచి మినిమం బాలెన్స్‌ చార్జీలు వసూలు చేయరాదని ఆర్‌బీఐ పేర్కొంది

అయితే బీఎస్‌బీడీ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. ఖాతా ఉన్న ఖాతాదారులు మరి ఏ ఇతర ఖాతాను కలిగి వుండడానికి వీల్లేదు. ఒక వేళ వుంటే ​అకౌంట్‌ను ఓపెన్‌ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది. అంతేకాదు నో ఫ్రిల్‌ ఖాతాలను తెరవడానికి ముందే...తనకు ఇతర  బ్యాంకుల్లో బీఎస్‌బీడీ  ఖాతా ఏదీ లేదని ధృవీకరణ కూడా చేయాల్సి వుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు