సుందర్‌ పిచాయ్‌ వార్షిక వేతనం ఎంతో తెలుసా

21 Dec, 2019 11:30 IST|Sakshi
అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌(ఫైల్‌ ఫోటో)

అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు భారీ వేతనం 

మరోసారి అతిపెద్ద స్టాక్‌ అవార్డు  

అల్ఫాబెట్‌  కొత్త  సీఈవో సుందర్‌ పిచాయ్‌ మరో అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్‌ ఇపుడు అతిపెద్ద స్టాక్‌ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డు  రూపంలో 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17వందల కోట్ల) అందుకుంటారు. అలాగే  2020 నుండి పిచాయ్‌ అందుకోనున్న (టేక్‌ హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు  అల్ఫాబెట్‌ శుక్రవారం అందించిన  రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్‌ సీఈవోలలో సుందర్‌ పిచాయ్‌ ఒకరు. గూగుల్‌  సీఈవోగా  సుందర్‌ పిచాయ్‌ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు.  2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 652,500 డాలర్లు.  మరుసటి సంవత్సరం అతని ఆదాయాలు ఆకాశాన్నంటింది.    ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును  గూగుల్‌ సంస్థ అందించింది.   కాగా  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. గూగుల్‌ మాతృసంస్థ , ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు  సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్  తీసుకుంటున్న కారణంగా అల్ఫాబెట్‌కు సీఈవోగా  పిచాయ్‌ ఎంపికయ్యారు.  దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూలవేతనం 1.2 మిలియన‍్ల డాలర్లు.

మరిన్ని వార్తలు