అమర రాజా నికర లాభం

30 May, 2015 01:21 IST|Sakshi
అమర రాజా నికర లాభం

రూ. 102 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 28 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 80 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 102 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 21 శాతం వృద్ధితో రూ. 885 కోట్ల నుంచి రూ. 1,066 కోట్లకు పెరిగింది.

ఏడాది మొత్తం మీద కంపెనీ రూ. 4,211 కోట్ల ఆదాయంపై నికరలాభం రూ. 411 కోట్లుగా నమోదయ్యింది. ఆటోమోటివ్ బ్యాటరీల విభాగంలో రెండంకెల వృద్ధి నమోదు కావడంతో రికారు స్థాయి ఫలితాలను నమోదు చేయగలిగినట్లు అమర రాజ బ్యాటరీస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. ప్రతీ షేరుకు రూ. 3.61 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు