డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు

5 May, 2014 01:03 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు

 హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

 రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్‌మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి.
 

మరిన్ని వార్తలు