ఇకపై అలెక్సాలో స్కైప్‌ కాలింగ్‌...

21 Nov, 2018 14:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘హేయ్‌ అలెక్సా కాల్‌ టు మై డాడ్‌ ఆన్‌ స్కైప్‌ అనగానే మీరు అనుకున్నవారికి వీడియో కాల్‌ చేసే సదుపాయం ఇప్పుడు అలెక్సా డివైస్‌లకు వచ్చేసింది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు రెం‍డు కలిసి ఈ మేరకు తమ సర్వీసులను వినియోగ దారులకు అందించనున్నాయి. గతంలో అలెక్సా నుంచి అలెక్సా డివైసెస్‌కు మాత్రమే వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఈ సదుపాయం స్కైప్‌ అకౌంటు ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు కూడా  అందుబాటులోకి  వచ్చింది.

బ్రిటన్‌, అమెరికా, ఐర్లాండ్‌, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి 39 దేశాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి రాగా ఇతర దేశాలకు కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇంట్రడక్షన్‌ ఆఫర్‌ కింద నెలకు వంద నిమిషాల ఉచిత కాలింగ్‌ను రెండు నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందడానికై అలెక్సా డివైస్‌లోని సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి కమ్యూనికేషన్‌ విభాగంలోని స్కైప్‌తో జత చేయాలి.

అలెక్సా అంటే... !
మన స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్న గూగుల్‌ అసిస్టెంట్‌, సిరి, కోర్టానా లాగే అలెక్సా కూడా వాయిస్‌ కమాండ్స్‌ ఆధారంగా పని చేసే వర్చువల్‌ అసిస్టెంట్‌. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఈ డివైస్‌ను డెవలప్‌ చేసింది. న్యూస్‌, పాటలు, పోడ్‌కాస్ట్‌లను వినిపించడం, నిర్దేశించిన సమయానికి అలారం మోగించడం వంటి పనులు కృత్రిమ మేధ సహకారంతో చేస్తుంది.

అప్‌డేట్‌ అందుకోనున్న డివైస్‌లు...
అమెజాన్‌ ఎకో ఫస్ట్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో సెకండ్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో ప్లస్‌ సెకండ్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో డాట్‌ సెకండ్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో డాట్‌ థర్డ్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో షో ఫస్ట్‌ జనరేషన్‌
అమెజాన్‌ ఎకో షో సెకండ్‌ జనరేషన్‌
 అమెజాన్‌ ఎకో షో స్పాట్‌ డివైసెస్‌

మరిన్ని వార్తలు