దుమ్మురేపుతున్న అమెజాన్‌ సీఈవో ట్వీట్‌

16 Jun, 2017 14:52 IST|Sakshi
దుమ్మురేపుతున్న అమెజాన్‌ సీఈవో ట్వీట్‌

లాస్ఏంజిల్స్:  తరచూ  ట్విట్టర్‌లో  యాక్టివ్‌గా ఉంటే అమెజాన్  బాస్‌ తాజా ట్విట్‌తో దుమ్ము రేపుతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్  దిగ్గజం అమెజాన్‌ ఫౌండర్‌, సీఈవో జెఫ్ బీజోస్ తనకు ఐడియాలు కావాలంటూ  ట్వీట్‌ చేశారు. త‌న సంపాద‌న‌ను దానం చేయాల‌నుకుంటున్నాననీ దీనికి సలహాలివ్వాంటూ ఫాలోయర్స్‌ను ఆహ్వానించారు. కోట్లాది రూపాయాల‌ను విరాళం ఇవ్వాల‌నుకుంటున్నానని ప్రకటించారు.  తాను ఇవ్వ‌బోయే విరాళాన్ని ఖ‌ర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్‌లో కోరారు. ఆయ‌న ట్వీట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే వేల రీట్వీట్‌లు, 10 వేల లైకులతో ట్విట్టర్‌ లో సంచలనంగా మారింది.  సుమారు 15 వేల రిప్ల‌య్‌ల జోరు నడుస్తోంది.

బ్లూఓరిజన్‌, వాషింగ్‌టన్‌పోస్ట్‌, అమెజాన్‌ సమాజంలో కోసం భారీ విరాళాలిస్తున‍్నప్పటికీ..తన ఆస్తుల్లో ఎక్కువ శాతం దానం చేయాల‌నుకుంటున్న జెఫ్‌ ఈ విషయాన్ని  ట్విట్ట‌ర్ ద్వారా  వెల్ల‌డించారు. తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని.. కానీ ఇంకా చేయాలని కోరికగా ఉందన్నారు. అత్యవసరమైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించేలా ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని  దీనికి ఐడియాలు కావాలని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు తెలియజేయాలని కోరారు. 

కాగా జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల భారీ విరాళాన్ని అందించింది.  వీరినుంచి 35 మిలియన్  డాలర్లను అందుకున్నట్లు  రీసెర్చ​ సెంటర్‌ గత నెలలో  ప్రకటించింది.  41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే  అతిపెద్ద సింగిల్ విరాళమని ప్రకటించడం  విశేషం.
 

మరిన్ని వార్తలు