జెఫ్‌ బెజోస్‌- కిషోర్‌ బియానీ డీల్‌ సిద్ధం?

27 Nov, 2018 12:04 IST|Sakshi

ఫ్యూచర్స్‌ రీటైల్‌లో అమెజాన్‌  భారీ పెట్టుబడులు

9.5శాతం వాటా కొనుగోలు

2500 కోట్ల రూపాయల  పెట్టుబడులు

దేశీయ రీటైల్‌  మార్కెట్‌లో తన  ఉనికిని మరింత పటిష్టం చేసేందుకు అమెరికన్‌ రీటైల్‌దిగ్గజం అమెజాన్‌ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెరికన్ ఆన్‌లైన్‌ రిటైలర్  అమెజాన్‌ దేశీయ కంపెనీ వాటాపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ స్థాపకుడు కిషోర్ బియానీతో ప్రాథమిక చర్చలు  నిర్వహిస్తోంది. ఫ్యూచర్స్‌  రీటైల్‌  లిమిటెడ్‌లో  రూ.2500 కోట్ల మేర దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోందని ఎకానమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది.  ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్‌ (FPI)గా  నిబంధనలు  అనుమతినిస్తే 8-9సంవత్సరాల  పాటు ఈ పెట్టుడులను పెట్టనుంది.

ఫ్యూచర్ రీటైల్లో అమెజాన్ 9.5శాతం వాటాను కొనుగోలుకు సంబంధించి  తొలి విడత చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపింది. అధికారికంగా  ఎలాంటి సమాచారం లేనప్పటికీ వచ్చే నెలలో ఈడీల్‌ వివరాలను  ప్రకటించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఫ్యూచర్ రిటైల్ (స్టాక్-ఎక్స్చేంజ్ డేటా) 46.51వాటా బియానీ,  అతని కుటుంబం సొంతం. ఫ్యూచర్‌ రీటైల్‌లో  బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లు ఉన్నాయి.

షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలను సొంతం చేసుకుంది.  దీంతోపాటు అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ (మోర్‌)లో కూడా విట్‌ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో  కలిసి పెట్టుబడులను సమకూర్చింది. మరోవైపు దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు