అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు

30 Nov, 2018 08:45 IST|Sakshi

అమెజాన్‌లో కొత్తగా 2 వేల మందికి అవకాశాలు

బెంగళూరులో 587 ఖాళీలు

హైదరాబాద్‌లో 374 ఉద్యోగాలు

టెక్‌ దిగ్గజం అమెజాన్‌లో భారీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. టెక్నాలజీ, నాన్‌ టెక్నాలజీ విభాగాల్లో రెండు వేలమంది ఉద్యోగులను  నియమించుకోనున్నామని  కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్  ఒకరు వెల్లడించారు.

మొత్తం 2వేల ఉద్యోగాల్లో 50శాతం టెక్‌, 50శాతం నాన్‌టెక్‌ విభాగాల్లో ఉన్నట్టు అమెజాన్‌ హెచ్‌ఆర్‌​ డైరెక్టర్‌ దీప్తివర్మ తెలిపారు. అమెజాన్.కాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.ఇన్‌తోపాటు డివైసెస్ డివిజన్‌ సహా దేశంలోని పలు విభాగాల్లో వీరిని ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఈ మేరకు అమెజాన్ జాబ్స్ వెబ్‌సైట్‌లో బెంగళూరులో 587, హైదరాబాద్‌లో 374 ఖాళీలున్నట్టు వివరాలు పొందుపరిచారు.

సాఫ్ట్‌వేర్‌ డెవలప్మెంట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్ -బిజినెస్‌ క్వాలిటీ, వెండార్‌ ఆపరేషన్స్ అసోసియేట్, మేనేజర్, రిస్క్ ఇన్వెస్టిగేషన్స్, క్వాలిటీ అస్యూరెన్స్ టెక్నీషియన్, అమెజాన్ యాప్‌స్టోర్, బిజినెస్ ఎనలిస్ట్, అసోసియేట్ సైట్ మెర్చాండైజర్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్  తదితర ఉద్యోగాలకు నూతనంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మరిన్ని వార్తలు