అమెజాన్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌

19 Dec, 2017 12:16 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఇకామర్స్‌ దిగ్గజం  అమెజాన్‌ మరో  స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్‌ చేయనుంది. ఇప్పటికే  స్మార్ట్‌ఫోన్‌  రంగంలోకి ప్రవేశించిన అమెజాన్‌  కొత్త సంవత్సరంలో మరో సరికొత్త మోడల్‌ను లాంచ్‌ చేయనుంది.   టెనార్‌ బ్రాండ్‌ నేమ్‌ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేయనుంది.

టెనార్‌ ఇ , టెనార్‌ జీ పేరుతో  రెండు డివైస్‌లను విడుదల చేసిన అమెజాన్‌  వచ్చే జనవరిలో  ఈ తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేయనుంది.  తన ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌ కొద్ది రోజుల ముందు అమెజాన్‌ వీటిని లాంచ్‌  చేసిన సంగతి విదితమే.

ఎంపిక, ధరలను అర్థం చేసుకోవటానికి , సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడంలో విక్రేతలు, వినియోగదారుల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంలో కస్టమర్లు అభిప్రాయాలను గౌరవిస్తామని  అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు.దీన్ని  క్రాఫ్టెడ్‌ ఫర్‌ అమెజాన్‌గా  కంపెనీ పిలుస్తోంది.  మరోవైపు  స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఇండియాలో  ప్రైవేట్ లేబుల్ మార్కెట్‌  కొత్త పరిణామమని నిపుణుల భావన. స్మార్ట్‌ఫోన్‌  టాబ్లెట్‌ మార్కెట్లో  8.5-9 బిలియన్ డాలర్ల వార్షిక రన్‌ రేటు పెరగనుందని  రెడ్‌సీర్‌  కన్సల్టింగ్ సీఈవో అనిల్ కుమార్ పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు