ఎయిర్‌టెల్‌తో అమెజాన్‌ జోడీ..

4 Jun, 2020 17:04 IST|Sakshi

ముంబై: వ్యాపార సామ్రాజ్యంలో చరిత్ర సృష్టించిన రెండు దిగ్గజ కంపెనీలు త్వరలో జోడీ కట్టనున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ త్వరలోనే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో రూ. 200కోట్ల డాలర్ల వాటాను విక్రయించనుంది. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో టెలికాం సంస్థగా పేరొందిన విషయం తెలిసిందే. కాగా అమెజాన్, ఎయిర్‌టెల్‌ సంస్థలు తమ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందాలకు సంబంధించిన ఊహాగానాలను కొందరు సంస్థ ప్రతినిధులు కొట్టిపారేశారు. మరోవైపు అమెజాన్‌, ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఒప్పందాలపై సంస్థ ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని తెలిపారు. కాగా ఒప్పందాల అంశంలో సంస్థ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. సరియైన సమాచారం కోసం మరికొంత సమయం వేచిచూడాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

మరోవైపు ఎయిర్‌టెల్‌ పోటీ సంస్థ జియో పెట్టుబడులను ఆకర్శించడంలో దూసుకెళ్తుంది. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్‌  సంస్థ  బిలియన్ (100 కోట్ల )డాలర్ల  మెగా డీల్‌కు సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మొబైల్‌ రంగంలో రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెజాన్‌తో కలవడం వల్ల సంస్థ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చదవండి: జియో దెబ్బ ‌: భారీగా ఎగిసిన ఎయిర్‌టెల్‌ సంపద

మరిన్ని వార్తలు