ఇ-కామర్స్‌ ట్రేడ్‌వార్‌: భారీ నిధులు

9 May, 2018 11:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కపక్క ఈ కామర్స్‌ వ్యాపారంలో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది.  మరోపక్క ఈ ట్రేడ్‌వార్‌ లో పోటీని తట్టుకునే నిలబడే వ్యూహంలో భాగంగా అమెజాన్‌ ఇండియాలో భారీగా నిధుల వెల్లువ. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ఈ సాయంత్రం అధికారికంగా  వెల్లడికానున్న నేపథ్యంలో  ఫ్లిప్‌కార్ట్‌ ప్రధాన  ప్రత్యర్థి అమెజాన్‌ కూడా ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.   మాతృసంస్థ అమెజాన్  అమెజాన్‌ ఇండియాలో మరోసారి భారీగా నిధులు సమకూర్చుతోంది.   తాజాగా 2,600 కోట్ల  రూపాయల (385.7మిలియన్‌ డాలర్లు) నిధులు అందజేసింది. దీనిపై అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ  భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి, కస్టమర్లకు విశ్వసనీయమైన సేవలను అందించేందుకు  భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సమకూర్చనున్నట్టు   వెల్లడించారు.
 
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించిన సమాచారం ప్రకారం,  అమెజాన్‌ సంస్థ భారతీయ మార్కెట్లో రూ .2,600 కోట్ల పెట్టుబడును సమకూర్చి పెట్టింది. ఈ మేరకు 2018 ఏప్రిల్ 26 న అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.  ఫ్లిప్‌కార్ట్‌ను వాల్ మార్ట్ కొనుగోలు చేస్తున్న తరుణంలో పోటీని ఎదుర్కొనేందుకు అమెజాన్ ఇండియాకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయి. తాజా నిధులతో  పెట్టుబడుల మొత్తం విలువ రూ.20,000 కోట్లకుపైమాటే. 

కాగా గతేడాది నవంబర్ లో రూ.2,990 కోట్లు , ఈ ఏడాది జనవరిలో అమెజాన్ మాతృ సంస్థ  ద్వారా  రూ .1,950 కోట్ల నిధులను  అందుకుంది.  తాజా  పెట్టుబడులు తమ సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ మెగాడీల్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.  

మరిన్ని వార్తలు