బిగ్‌ బాస్కెట్‌పై అమెజాన్‌ కన్ను!

14 Jun, 2017 01:15 IST|Sakshi
బిగ్‌ బాస్కెట్‌పై అమెజాన్‌ కన్ను!

ప్రాథమిక స్థాయిలో చర్చలు
న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా నిత్యావసర సరుకుల విక్రయ ఆన్‌లైన్‌ సంస్థ బిగ్‌బాస్కెట్‌ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇవి ఫలవంతం కావొచ్చు లేక కాకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూపర్‌మార్కెట్‌ గ్రాసరీ సప్లైస్‌ సంస్థలో భాగమైన బిగ్‌బాస్కెట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన అబ్రాజ్‌ గ్రూప్, హీలియోన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, బెస్సీమర్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ మొదలైన ఇన్వెస్టర్ల నుంచి గతేడాది 150 మిలియన్‌ డాలర్లు సమీకరించింది.

కొత్తగా గిడ్డంగుల ఏర్పాటుకు, డెలివరీ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ట్రైఫెక్టా క్యాపిటల్‌ నుంచి మరో 7 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఆదాయాలు గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న బిగ్‌బాస్కెట్‌ ఇప్పటికే రెండు నగరాల్లో బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్‌ భారత్‌లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది.

మరిన్ని వార్తలు