కొబ్బరి చిప్ప కావాలా, నాయనా?

16 Jan, 2019 13:42 IST|Sakshi

అమెజాన్‌లో నాచురల్‌ కొబ్బరి చిప్ప వైరల్‌

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ అమ్మకాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. అయితే అమెజాన్‌లో బ్రాండెడ్‌ దుస్తులో, స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలో, ప్రముఖ ఎలక్ట్రానిక్‌ అమ్మకాలో కాదు.. అతి విలువైన పురాతన వస్తువులు అంతకన్నా కాదు. ఇప్పటివరకూ పిడకలు, గొబ్బెమ్మలు, రెడిమేడ్ పిడకలు కూడా అమెజాన్‌ ఆన్‌లైన్‌ స్టోర్లలో దర్శనమిచ్చాయి. తాజాగా కొబ్బరి చిప్ప కప్పు లిస్ట్‌లో కనిపించడం వింతగా కనిపించింది. నాచురల్‌ కోకోనట్‌ షెల్‌ కప్‌ పేరుతో  దీన్ని అమ్మకానికి పెట్టింది.

నెటిజన్ల వ్యంగస్త్రాలతో నాచురల్‌ కోకోనట్‌ షెల్‌ కప్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. నాచురల్‌ కోకోనట్‌ షెల్‌ కప్‌ ధర రూ.1289 నుంచి ప్రారంభం.. డిమాండ్‌ పెరిగితే రూ.2499 వరకూ అంటూ ఇది అమెజాన్‌లో కనిపించింది. పైగా 55 శాతం స్పెషల్‌ డిస్కౌంట్‌ తో రూ.1365 లకు (కొబ్బరిచిప్ప ధర రూ.3వేల)  అందిస్తోందట. 

ఈ రేటుకు మంచి పవర్ బ్యాంకునో, లేదా బ్రాండెడ్ హెడ్‌సెట్ కొనొచ్చు. నోకియా ఫీచర్ ఫోన్ కూడా కొనొచ్చు. రెండు సోనీ హెడ్‌సెట్స్ కూడా వస్తాయంటూ ట్విటర్‌లో జోకులు పేలుతున్నాయి. మా యింటి ద్గగర గుట్టల కొద్దీ కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అమెజాన్‌కు అవి ఉచితం అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. దీంతో ట్విటర్‌లో పెద్ద చర్చే మొదలైంది. ఈ నాచులర్‌ కోకోనట్‌​ షెల్‌ కప్‌ స్పెసిఫికేషన్స్‌ చూసి తీరాల్సిందే.  మరోవైపు ప్రస్తుతం ఈ కప్‌ అందుబాటులో లేదు అన్న సమాచారం అమెజాన్‌ సైట్‌లో కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు