ఆర్థిక ఫలితాలు

25 Jul, 2017 02:18 IST|Sakshi
ఆర్థిక ఫలితాలు

అంబూజా సిమెంట్స్‌ నికర లాభంలో 11.83% వృద్ధి

ముంబై: అంబూజా సిమెంట్స్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11.83% వృద్ధిచెంది రూ. 642 కోట్ల నుంచి రూ. 718 కోట్లకు చేరింది. నికర అమ్మకాల ఆదాయం 14.67% పెరుగుదలతో రూ. 5,359 కోట్ల నుంచి రూ. 6,145 కోట్లకు చేరింది.

12 శాతం తగ్గిన భారతి ఇన్‌ఫ్రాటెల్‌ నికర లాభం
న్యూఢిల్లీ: భారతి ఇన్‌ఫ్రాటెల్‌ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 12% క్షీణించి రూ.756 కోట్ల నుంచి రూ. 664 కోట్లకు తగ్గింది. ఆదాయం 10% వృద్ధితో రూ. 3,211 కోట్ల నుంచి రూ. 3,525 కోట్లకు పెరిగింది.  

టాటా కమ్యూనికేషన్స్‌ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్‌ లాభం జూన్‌ త్రైమాసికంలో 22% క్షీణించింది. రూ.32.94 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.42.38 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం 5% క్షీణించి రూ.4,552 కోట్ల నుంచి రూ.4,354 కోట్లకు పరిమితం అయింది.

హడ్కో లాభం 50 శాతం జంప్‌
న్యూఢిల్లీ: హడ్కో లాభం జూన్‌ క్వార్టర్లో ఏకంగా 52% వృద్ధితో రూ.211 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.139 కోట్లు. ఆదాయం రూ.891 కోట్ల నుంచి రూ.929 కోట్లకు పెరిగింది.

వామా ఇండస్ట్రీస్‌ లాభం రూ.1.8 కోట్లు
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వామా ఇండస్ట్రీస్‌ జూన్‌ క్వార్టర్లో నికర లాభం రూ.1.87 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1.44 లక్షలు. టర్నోవరు రూ.6 కోట్ల నుంచి 41.6 కోట్లకు ఎగసింది. 

మరిన్ని వార్తలు