హైదరాబాద్‌లో అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ ‘కోల్డ్‌ స్టోన్‌’

15 Feb, 2020 08:08 IST|Sakshi

350 కోట్లతో టేబ్లెజ్‌ విస్తరణ ప్రణాళికలు

టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ కోల్డ్‌ స్టోన్‌ క్రీమరీ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా ఉన్న లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన రిటైల్‌ విభాగం ‘టేబ్లెజ్‌’ దీన్ని ప్రారంభించింది. శుక్రవారమిక్కడ బంజారాహిల్స్, బేగంపేటలో రెండు ఔట్‌లెట్లను టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ ఏడాది మే ముగిసే నాటికి మరో మూడు స్టోర్లను తెరుస్తామని చెప్పారాయన. వచ్చే మూడేళ్లలో టేబ్లెజ్‌లో రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం టేబ్లెజ్‌ కింద స్ప్రింగ్‌ఫీల్డ్, వుమెన్‌ సీక్రెట్, టాయ్స్‌ ‘ఆర్‌’ అస్, బేబీస్‌ ‘ఆర్‌’ అస్, బిల్డ్‌ ఏ బియర్, గో స్పోర్ట్‌ మొత్తం ఆరు బ్రాండ్లున్నాయని.. త్వరలోనే కాస్మోటిక్, స్పోర్ట్స్‌ విభాగంలో కొత్త బ్రాండ్లను తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మన దేశంలో 61 టేబ్లెజ్‌ ఔట్‌లెట్లున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచింది.

నిర్మాణంలో హైదరాబాద్‌ మాల్‌..
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రానున్న లులు మాల్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అహ్మద్‌ తెలిపారు.  ఈ సంస్థ బెంగళూరు, లక్నోల్లో 10 లక్షల చదరపుటడుగుల్లో అతిపెద్ద మాల్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా 12 లక్షల చ.అ.ల్లో కేరళలో మాత్రమే లులు మాల్‌ ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా