అమెరికా ఫెడ్‌ రేటు  పావు శాతం పెంపు 

22 Mar, 2018 01:31 IST|Sakshi

1.75 శాతానికి పెరిగిన వడ్డీ రేటు 

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌.. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం– 1.75 శాతానికి చేరింది. ఈ ఏడాది ఇది తొలి విడత పెంపు కాగా.. మరో రెండు దఫాలుగా పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఏడాది రెండు దఫాలు, ఆ పై ఏడాది కూడా మరో రెండు విడతలు పెంచవచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. 2020లో అమెరికా వృద్ధి 2 శాతం ఉండొచ్చని, దీర్ఘకాలికంగా 1.8 శాతం ఉండొచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ అంచనా వేసింది.

రెండు రోజుల సమీక్ష అనంతరం అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) బుధవారం రాత్రి ఈ మేరకు నిర్ణయాలు వెలువరించింది. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌గా జేనెట్‌ యెలెన్‌ స్థానంలో జెరోమ్‌ పావెల్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫెడ్‌ రేటు పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రేటు నిర్ణయంతో అమెరికా మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. డౌజోన్స్‌ ఒక దశలో సుమారు 200 పాయింట్లు, నాస్‌డాక్‌ 40 పాయింట్లు లాభంలో ట్రేడయ్యాయి.    

మరిన్ని వార్తలు