వామ్మో.. అలాంటి వంటకమా!

1 Feb, 2019 15:26 IST|Sakshi

భార్యభర్తలు ఎప్పుడైనా గొడవపడుతూ ఉంటే.. ఎందుకు నన్ను ఇలా వేయించుకు తింటావు అని అనడం మామూలే. కానీ అదే నిజమైతే.. వేయించిన మొగుడు(రోస్టడ్‌ హస్బండ్‌) పేరుతో ఓ వంటకం ఉంటే ఎలా ఉంటుంది. ఇది చూశాక నిజంగా భార్యలకు ఇలాంటి ఐడియాలే వచ్చి వారి భర్తలను ఫ్రై​ చేస్తే ఇంకేమన్నాఉంటుందా?

ఇలాంటి ఐడియా తన సతీమణికి ఎక్కడ వస్తుందోనని ఆ రెస్టారెంట్‌ వైపు ఆమెను తీసుకెళ్లనని ఆనంద్‌ మహీంద్రా ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ‘నా భార్యతో కలిసి ఈ రెస్టారెంట్ వెళ్లాలంటే కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే ఆమెకు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రావడం నాకు ఇష్టం లేదు...’ అని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు