ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్, హెయిర్ కటింగ్ కష్టాలు 

18 Apr, 2020 13:08 IST|Sakshi
ఆనంద్ మహీంద్ర (ఫైల్ ఫోటో)

‘ఇన్‌స్టంట్ సూట్’కు ఆనంద్ మహీంద్ర  లుంగీ గిఫ్ట్ 

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన లాక్‌డౌన్‌  నిబంధనలను పాటిస్తున్న వ్యాపార వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా వాట్సాప్ వండర్ బాక్స్ విశేషాలను పంచుకుంటూ తన అనుచరులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు.  పలు వీడియోలు, చమత్కారాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల లుంగీ గురించి ప్రస్తావించి, నవ్వులు పూయించిన ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వాట్సాప్ వండర్ బాక్స్ లో తనను ఆకట్టుకున్న ఇన్‌స్టంట్ సూట్ గురించి  ప్రస్తావించారు.

కరోనా వైరస్ కాలంలో ‘ఇన్‌స్టంట్ సూట్’ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌కు త్వరగా ఎలా హాజరుకావచ్చో వివరించే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సూట్ కింద ధరించేందుకు ఈ పెద్దమనిషికి తాను ఒక లుంగీని కూడా పంపించాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. అంతేకాదు, లాక్‌డౌన్‌ మనకు చాలా విషయాలను నేర్పిస్తోందంటూ మగవాళ్ల హెయిర్ కటింగ్ కష్టాలపై కూడా ఆయన మరో ట్వీట్  చేయడం విశేషం. ఈ సందర్భంగా జుట్టును ఎలా కత్తిరించుకోవాలని నేర్చుకుంటున్నానని, కానీ తన వల్ల కావడం లేదంటూ బార్బర్  గొప్పతనాన్ని గుర్తిస్తున్నానని పేర్కొన్నారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్)

దీంతో ఎప్పటిలాగానే కమెంట్ల వెల్లువ కురుస్తోంది. అవసరమే ఆవిష్కరణకు నాంది అని ఒకరు, పొరపాటున కాన్ఫరెన్స్ కాల్ స్విచ్ చేయడం మర్చిపోతే పరిస్థితి ఏంటని మరికొందరు, లుంగీ లేకుండా వర్క్ ఫ్రం హోం చేయడం చాలా బోరింగ్" అని మరొకరు  వ్యాఖ్యానించారు.  ఇక హెయిర్ కటింగ్ కష్టాలపై ఒక్కొక్కరు ఒక్కో పోస్ట్ ట్విటర్లో సందడి చేస్తున్నారు. (ఓ గాడ్‌! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?)

 చదవండి : పెట్రో డిమాండ్ ఢమాల్

>
మరిన్ని వార్తలు