‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’పై ఆసక్తి కనబర్చిన ఆనంద్‌ మహీంద్రా

16 May, 2020 17:11 IST|Sakshi

ముంబై: సైన్యంలో చేరాలని ఉత్సాహం చూపే యువత కోసం భారత సైన్యం ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ అనే నూతన ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆచరణలోకి వస్తే ఆసక్తి ఉన్న యువత మూడేళ్లపాటు సైన్యంలో చేరి సేవలందించవచ్చు. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రతిపాదన పట్ల ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తి కనబర్చారు. తమ సంస్థలో ఉద్యోగులను తీసుకునేటప్పుడు టూర్‌ ఆఫ్‌ డ్యూటీ కింద పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.  ఈ మేరకు ఆయన ఆర్మీకి మెయిల్‌ చేశారు.(లాక్‌డౌన్‌ ప్రాణాలు కాపాడింది కానీ..

‘భారత ఆర్మీ ప్రతిపాదించిన టూర్‌ ఆఫ్‌ డ్యూటీ గురించి విన్నాను. దీని ద్వార భారత యువతకు మూడేళ్లపాటు సైన్యంలో సైనికులుగా, అధికారులుగా పని చేసే అవకావం లభిస్తుంది. పని చేసే చోట యువతకు ఇది అదనపు అవకాశంగా మారుతుంది. సైన్యంలో ఇచ్చే కఠిన శిక్షణ, ప్రమాణాలను దృష్ట్యా వీరిని మహీంద్రా గ్రూప్‌లోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది’ అంటూ మెయిల్‌ చేశారు.(సైన్యంలో ‘పరిమిత’ సేవ!)

మరిన్ని వార్తలు