‘కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయా’

21 Sep, 2019 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు చేతులు లేని ఓ చిన్నారి కాళ్ల సహాయంతో ఆహారం తినేందుకు చేస్తున్న ప్రయత్నం తనలో ఆశావాదాన్ని పెంపొందిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘ నా మనవడిని ఇటీవలే కలిశాను. కానీ ఈ వాట్సాప్‌ పోస్టు చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. జీవితం అనేది ఎన్నో సవాళ్లతో, ప్రతికూలతలతో నిండి ఉంటుంది. అయితే ఆ బహుమతిని ఏ విధంగా మలచుకున్నామనే విషయం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఫొటోలు చూసినపుడు నాలో ఆశావాదం పెంపొందుతుంది. నూతనోత్సాహాన్ని నింపుతుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఆనంద్‌ మహీంద్ర ట్విటర్‌లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ట్వీట్‌కు స్పందించిన భారత్‌ గ్యాస్‌ విభాగం తమిళనాడుకు చెందిన ఇడ్లీ అవ్వ కమలాతాళ్‌కు గ్యాస్‌ స్టవ్‌ అందించిన విషయం తెలిసిందే.(చదవండి : మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా