కరోనా అధిగమించేందుకు మహీంద్రా సూచనలు

9 Mar, 2020 17:22 IST|Sakshi

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అధిగమించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా పలు సూచనలు చేశారు. ఇంత పెద్ద సంక్షోభంలో కూడా దేశం అభివృద్ధి చెందడానికి కొన్ని సానుకూల అంశాలున్నాయని.. వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన విలువైన సూచనలను మహీంద్రా సోమవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ వల్ల చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని..వినియోగాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని సూచిస్తూ ట్వీట్‌ చేశారు.

చైనాను వణికిస్తున్న కరోనా కారణంగా ఆ దేశంలో పర్యటించేందుకు వెనుకంజ వేస్తున్న పర్యాటకులను భారత్‌ ఆకర్షించాలని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు పరిశుభ్రత, స్వచ్ఛ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందిన చైనాలో ప్రస్తుతం కరోనా కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకొని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సరళమైన ఆర్థిక విధానాలను రూపొందించాలని పేర్కొన్నారు.
 

చదవండి: గుర్తుంచుకోండి.. అందరం టీ కప్పు లాంటి వాళ్లమే

మరిన్ని వార్తలు