ఆంధ్రా బ్యాంక్‌ వన్‌

12 Dec, 2016 01:09 IST|Sakshi
ఆంధ్రా బ్యాంక్‌ వన్‌

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోన్న యుగమిది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్‌  చుట్టే తిరుగుతోంది. అందుకు ఆర్థిక లావాదేవీలకు మీ ఫోన్‌నే బ్యాంకుగా మార్చేసుకోండి. సులభంగా డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండి. ఇది ఎలా అంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే యూపీఐ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే పలు బ్యాంకులు వాటి యూపీఐ యాప్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి. వాటిల్లో మనమిప్పుడు ‘ఆంధ్రా బ్యాంక్‌ వన్‌’ అనే యూపీఐ యాప్‌ గురించి తెలుసుకుందాం. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
ఒకే మొబైల్‌ యాప్‌ ద్వారా పలు బ్యాంక్‌ ఖాతాలనుఆపరేట్‌ చేయవచ్చు.
వర్చ్యువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ ద్వారా ఏ బ్యాంక్‌ ఖాతాకైనా సులభంగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఇక్క డ ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎ‹స్‌సీ కోడ్‌లతో పనిలేదు.
బ్యాంక్‌ ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎ‹స్‌సీ కోడ్‌ సాయంతో కూడా డబ్బుల్ని ఇతరులకు పంపే ఆప్షన్‌అందుబాటులో ఉంది.
అలాగే వర్చ్యువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ కలిగిన ఎవరి నుంచైనా డబ్బుల్ని తీసుకోవచ్చు.
లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే.. వాటి గురించి యాప్‌ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని వార్తలు