యస్‌ బ్యాంక్‌: ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ

19 Mar, 2020 11:58 IST|Sakshi

మొంబై: యస్‌ బ్యాంక్‌ సంబంధించిన కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరెట్‌) ఎదుట మొంబైలో విచారణకు హాజరయ్యారు. అనిల్‌ అంబానీకి చెందిన 9 కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. అయితే కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ పేర్కొంది. ఇప్పటికే యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మణీ లాండరింగ్‌ కేసులో అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. నిరర్థక ఆస్తులు ఎక్కువైన కారణంగానే యస్‌ బ్యాంక్‌ సంక్షోభంలోకి వెళ్లిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చదవండి: అయ్యో.. అ‘నిల్‌’!

మరిన్ని వార్తలు