ఆగని పెట్రో భారాలు

25 Jun, 2020 09:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరసగా 19వ రోజు గురువారం కూడా పెరిగాయి. పెట్రోల్‌ ధరను లీటర్‌కు 16 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 14 పైసల చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. భారత్‌లో తొలిసారిగా డీజిల్‌ ధరలు పెట్రోల్‌ ధర కంటే పెరిగాయి. ఇక తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌కు 82.79 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 79.92 రూపాయలకు పెరగ్గా, డీజిల్‌ లీటర్‌ ధర ఏకంగా 80.02 రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను పెంచడంతోనే డీజిల్‌ ధరలు దేశరాజధానిలో పెట్రోల్‌ను మించిపోయాయని ప్రభుత్వరంగ ఐఓసీ చీఫ్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. 

చదవండి : ఢిల్లీ: పెట్రోల్‌తో పోటీ పడిన డీజిల్‌ ధర

మరిన్ని వార్తలు