పుత్తడి హెచ్చుతగ్గులు.. మరోవారం నష్టాలు

3 Aug, 2015 01:17 IST|Sakshi
పుత్తడి హెచ్చుతగ్గులు.. మరోవారం నష్టాలు

ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా గతవారం దేశీయ మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల విక్రయాల ఫలితంగా మరోవారం పుత్తడి ధర తగ్గింది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు,  ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడటం వంటి అంశాలతో ఇటీవల బంగారం ధర క్షీణిస్తూ వస్తోంది. అయితే గత శుక్రవారం వెలువడిన అమెరికా ఆర్థిక గణాంకాలు బలహీనంగా వుండటంతో వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరగకపోవొచ్చన్న అంచనాలతో ఆ రోజు బంగారం ధర పెరిగింది. వెరసి వారమంతా ధర హెచ్చుతగ్గులకు లోనయ్యింది.

న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 9 డాలర్ల పెరుగుదలతో 1,095 డాలర్ల వద్ద ముగిసింది. స్థానికంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు రూ. 105 క్షీణించి రూ. 25.040 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛతగల బంగారం ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 24,890 వద్ద క్లోజయ్యింది.

>
మరిన్ని వార్తలు