విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

8 Aug, 2019 13:11 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాటర్‌ హీటర్ల తయారీలో ఉన్న యూఎస్‌ దిగ్గజం ఏ.ఓ.స్మిత్‌ తాజాగా హీట్‌బోట్‌ పేరుతో ఎనిమిది నూతన మోడల్స్‌ను బుధవారమిక్కడ విడుదల చేసింది. రిమోట్‌తో పనిచేసే ఈ హీటర్‌లో ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఏ సమయానికి వేడి నీళ్లు కావాలో టైమర్‌తో నిర్దేశించవచ్చు. ధరల శ్రేణి రూ.10–15 వేలుంది. అలాగే ఎక్స్‌–7 ప్లస్‌ పేరుతో ఆర్‌వో వాటర్‌ ప్యూరిఫయర్‌ను సైతం ప్రవేశపెట్టింది. టీడీఎస్‌ స్థాయి 3,000 వరకు ఉన్న నీటిని కూడా ఇది శుద్ధిచేస్తుందని ఏ.ఓ.స్మిత్‌ ఇండియా వాటర్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ పరాగ్‌ కులకర్ణి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ఇతర ఆర్‌వోలతో పోలిస్తే నీటి వృధా గణనీయంగా తగ్గిస్తుంది. ధర రూ.18,000గా నిర్ణయించాం. ఇక స్టోరేజ్‌ వాటర్‌ హీటర్ల విభాగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. ఎక్కువ కాలం మన్నేలా పేటెంటెడ్‌ టెక్నాలజీ అయిన బ్లూ డైమండ్‌ గ్లాస్‌ లైనింగ్‌ను హీటర్ల తయారీలో వాడుతున్నాం. ఏటా నాలుగైదు వాటర్‌ ప్యూరిఫయర్లు, 7–10 వాటర్‌ హీటర్లను ప్రవేశపెడతాం. నాణ్యత, టెక్నాలజీ పరంగా విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం’ అని వివరించారు.

మరిన్ని వార్తలు