ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు రుణాలు

12 Mar, 2020 11:10 IST|Sakshi
ఎంవోయూతో అవర్‌ ఫుడ్‌ బాలా రెడ్డి, ఏపీజీబీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, ఇతర బ్యాంక్‌ ప్రతినిధులు.

నిరుద్యోగ యువత, రైతులకు అవకాశం

ఏపీజీబీతో అవర్‌ ఫుడ్‌ ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిరుద్యోగ యువత, రైతులకు తక్కువ ధరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక చేయూత, మార్కెటింగ్‌ సేవలను అందించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ సిద్ధమైంది. ఈ మేరకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (ఏపీజీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అవర్‌ ఫుడ్‌ సీఈఓ వీ బాలా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ స్థానిక బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు