రెండేళ్లలో రూ. 1,400 కోట్లు పెట్టుబడులు

15 Nov, 2016 01:17 IST|Sakshi
రెండేళ్లలో రూ. 1,400 కోట్లు పెట్టుబడులు

విస్తరణలో అపోలో హాస్పిటల్స్
క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏడాదిన్నరలో ప్రోటాన్ థెరపీ
వైజాగ్‌లో క్యాన్సర్ చికిత్స విభాగం

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ సంస్థ విస్తరణ నిమిత్తం రెండేళ్లలో రూ.1,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. క్యాన్సర్ పేషెంట్ల కోసం చెన్నై హాస్పిటల్‌లో త్వరలో అధునికమైన ప్రోటాన్ థెరపీని అందుబాటులోకి తేనున్నామని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన పని ఇప్పటికే మొదలైందని, ఈ థెరపీ ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి రానున్నదని వివరించారు.  నవీ ముంబైలో అపోలో గ్రూప్‌కు చెందిన  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గౌహతిలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, జైపూర్‌లో హాస్పిటల్ నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేశామని వివరించారు.

 క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ప్రోటాన్ థెరపీ  ప్రస్తుతం చైనా, జపాన్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉందని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్, భువనేశ్వర్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ చికిత్సా విభాగాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు