యాప్‌కీ కహానీ...

1 Jan, 2018 02:15 IST|Sakshi

తెలంగాణ ఇ–చలాన్‌

రవి ఎస్‌బీఐ చెక్‌బుక్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు. పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో బైక్‌ను రోడ్డుపైనే ఆపాడు. పని అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత రోజూవారీ కార్యకలాపాల్లో బిజీ అయ్యాడు. ఒకరోజు రోడ్డుపై బైక్‌లో వెళ్తుంటే రవిని ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. డాక్యుమెంట్లు అడిగారు. చూపించాడు.

అయితే హెల్మెట్‌ పెట్టుకోలేదు. దీంతో వారు జరిమానా వేసి పంపించారు. దాన్ని కట్టేదామని ఈ–సేవకు వెళ్లాడు. అక్కడ రవి షాక్‌ అయ్యాడు. ఎందుకంటే అతని బైక్‌పై రెండు చలానాలు ఉన్నాయి. ఒకటేమో హెల్మెట్‌ది అయితే. మరొకటేమో పార్కింగ్‌కు సంబంధించినది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే మన వాహనంపై చలానాలు ఏమైనా ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ‘తెలంగాణ ఇ–చలాన్‌’ అనే యాప్‌ అందుబాటులో ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆవిష్కరించింది. ఈ యాప్‌ను గూగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

ప్రత్యేకతలు  
♦  వెహికల్‌ నంబర్, ఫోన్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ సాయంతో యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.  
♦ ట్రాఫిక్‌ పెండిగ్‌ చలానాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవచ్చు. ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు.
♦ చలానా మొత్తాన్ని యాప్‌ ద్వారా చెల్లించొచ్చు.     

మరిన్ని వార్తలు